అధికారులతో సమీక్షిస్తున్న కమిషనర్
యశవంతపుర: బైకును టెంపో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. విశ్వేశ్వరయ్య లేఔట్‌కు చెందిన కుమార్ (32) వంట మనిషిగా చేస్తున్నారు. అర్ధరాత్రి విధులు ముగించుకుని ముద్దయ్యనపాళ్య నుంచి బైకులో ఇంటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన టెంపో ఢీకొంది. గాయపడిన కుమార్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని మరొకరు..:
ఇద్దరు బార్ బెండర్లు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చిక్కపేట ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఓకళపురంకు చెందిన సతీశ్ (40) మృతి చెందారు. సతీశ్ తన స్నేహితుడితో కలిసి మంగళవారం ఉదయం ఓకళపురం నుంచి కాటన్‌పేటకు పనులకు వెళ్తుండగా సంగోళి రాయణ్ణ జంక్షన్ వద్ద అతివేగంగా లారీ బైకుపై దూసుకెళ్లటంతో ఇద్దరు గాయపడ్డారు. సతీశ్ అక్కడిక్కడే మృతి చెందగా, బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. చిక్కపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కన్నడలోనే బోర్టులు పెట్టాలి
యశవంతపుర: బీబీఎంపీ పరిధిలోని వాణిజ్య దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా కన్నడలోనే బోర్డులు ఏర్పాటు చేయాలని పాలికె కమిషనర్ తుషార్ గిరినాథ్ సూచించారు. ఇందుకు సంబంధించి మంగళవారం కేంద్ర కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగళ్లు, హోటళ్లతో పాటు ఇతర వాణిజ్య మాల్స్‌పై కన్నడంలో నామఫలకాలను ఉంచాలని అధికారులకు సూచించారు. కన్నడ బోర్డులేని అంగళ్లకు నోటీసులివ్వాలని అధికారులకు సూచించారు. కన్నడ బోర్డులు పెట్టడానికి గడువు విధించి కన్నడంలో బోర్డులు పెట్టని అంగళ్లకు లైసెన్స్ ఇవ్వరాదని సిబ్బందికి సూచించారు. 15 రోజుల్లో సర్వేని పూర్తి చేసి కన్నడలోనే బోర్డులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment