నవలి రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక అధికంగా పేరుకు పోవడంతో నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మార్చిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో చర్చించామన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, భూ స్వాధీనం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో భూ గర్భ జలాల పెంపుదలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖలో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించామన్నారు. బడ్జెట్‌లో రూ.13 వేల కోట్ల నిధులు కేటాయించాలని సీఎంను కోరామన్నారు. రాంపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అదనంగా 10 ఎకరాలు, చిక్కసూగూరు వద్ద 50 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కృష్ణ, తుంగభద్ర కాలువల నుంచి లింక్ చేసి నీటిని నింపి ప్రజలకు నీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, సభ్యులు జయన్న, రమేష్, నేతలు శాలం, నరసింహులు, బసవరాజ్, రుద్రప్ప, శాంతప్ప, శివమూర్తి, నిర్మల పాల్గొన్నారు.
మార్చిలో మూడు రాష్ట్రాల
ముఖ్యమంత్రుల సమావేశం
ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు, భూస్వాధీనానికి రూ.9 వేల కోట్లు
రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment