బంగారు గొలుసు కొట్టేయాలని..
శివమొగ్గ: బంగారం రేట్లు ఆకాశాన్ని అంటడంతో దానిపట్ల వ్యామోహం కూడా పెరిగిపోతోంది. దీంతో అడ్డదారులు తొక్కేవారు ఉన్నారు. నగల షాపులో కోనుగోలుదారులుగా వచ్చి బంగారు చైన్ చోరీకి యత్నించి ఇద్దరు మహిళలు దొరికిపోయారు. శివమొగ్గ నగరంలోని గాంధీ బజార్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. వివరాలు..ఈ నెల 18వ తేదీన నగరానికే చెందిన ఇద్దరు మహిళలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో హడావుడిగా ఓ నగల అంగడికి వచ్చారు. 15– 20 గ్రాముల బంగారు చైన్లను చూపించాలని యజమాని కిరణ్‌షా ని అడిగారు. ఆయన ఓ చైన్‌ని ట్రేలో పెట్టి ఇచ్చాడు. మహిళలు దానిని పరిశీలిస్తున్నట్లు నటిస్తూ తమతో తెచ్చిన గిల్టు చైన్‌ను ట్రేలో పెట్టి అసలు గొలుసును కొట్టేశారు. షాపు నుంచి గబగబా వెళ్లిపోతుండగా అనుమానంతో పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అసలు చైన్‌ని యజమానికి ఇప్పించి మహిళలను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment