బనశంకరి: సిద్దరామయ్య సర్కారు ఉగాది కానుకను వినూత్నంగా ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాలు, పెరుగు ధరను ప్రతి లీటరుపై రూ.4 పెంపు జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతుంది. గురువారం విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో పెంపును ఖరారు చేశారు. నిజానికి కేఎంఎఫ్ రూ.5 పెంచాలని కోరిందని, తామే ఒక్క రూపాయ తగ్గించామని సర్కారు వర్గాలు చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో పాలు, పెరుగు ధర పెంపు ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఉగాది బహుమతి అని విమర్శలు వచ్చాయి. దీని వల్ల హోటళ్లలో కాఫీ, టీల ధరలు భగ్గుమంటాయని ఆక్రోశం వ్యక్తమౌతోంది.
లీటర్‌కు రూ.4 పెంపు