
పారువేటను హలాల్ రహితంగా నిర్వహించుకోవాలి
హుబ్లీ: ఉగాది అనంతరం పారువేటను హాలాల్ రహితంగా నిర్వహించుకోవాలని శ్రీరామ సేనా ముఖ్యస్తులు ప్రమోద్ ముతాలిక్ సూచించారు. ధార్వాడలో మీడియాతో మాట్లాడారు. హాలాల్ అన్నది ఇస్లాంకు సంబంధించింది. అది హిందూవులకు సంబంధించినది కాదన్నారు. బసవన్నగౌడ పాటిల్ యత్నాల్ బహిష్కరణ గురించి ఆయన మాట్లాడుతూ బీజేపీ హై కమాండ్ ఈ విషయంలో పునర్ పరిశీలించాలని సూచించారు.
తండ్రి మృతి చెందిన
దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
హొసపేటె: తండ్రి మరణించిన దుఃఖంలోనూ టెన్త్ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. హోస్పేట్‌లోని టీబీ డ్యామ్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థి హరిధరన్ తండ్రి సెల్వకుట్టి శుక్రవారం తమిళనాడులో అనారోగ్యంతో మరణించాడు. తండ్రి ఆరోగ్యం క్షీణించినప్పుడు హరిధరన్ తమిళనాడు వెళ్లి చూచి వచ్చాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో సెల్వకుట్టి మృతి చెందాడు. అయినా ఆ బాధను దిగమింగి హరిధరన్ పరీక్ష రాశాడు.
నీటి వనరులను పరిరక్షించాలి
హుబ్లీ: కేఎల్‌ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశ్వజల దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. జలవనురుల శాఖ, నీటిపారుదల కార్పొరేషన్ ధార్వాడ విభాగం చీఫ్ ఇంజినీర్ అశోక్ ఎల్ వాసన్ మాట్లాడుతూ నీటి పొదుపు పాటించి బావి తరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపు వినియోగం పరకరాల ప్రదర్శణ ఏర్పాటు చేశారు