
అంబేడ్కర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం
బళ్లారిఅర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా బళ్లారిలో తొలిసారిగా అంబేడ్కర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్–2025 సీజన్–1 పోటీలు విమ్స్ మైదానంలో సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలు ఈనెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. జీకే ఫౌండేషన్, జీకే గ్రూప్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను యువనేత కట్టెస్వామి ప్రారంభించి మాట్లాడారు. నగరంలో తొలి సారిగా భారీ స్థాయిలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి వేళ పోటీలను నిర్వహించడం హర్షనీయం అని జట్టు యజమానిని, క్రీడాకారులను అభినందించారు. ప్రముఖురాలు మల్లేశ్వరి, నిర్వాహకులు చంద్రన్న మాట్లాడుతూ ఈ టోర్నీలో 14 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయన్నారు. 8 రోజుల పాటు పోటీలు జరుగుతాయన్నారు. ఫైనల్ పోటీ ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తామన్నారు. క్రికెట్ పోటీల నిర్వాహకులు మహేష్ కురువళ్లి, కే.వెంకటేష్, ఏకే.తిప్పయ్య, ఎస్.ప్రకాష్, రత్తయ్య, శివరామ, గురు, దుర్గప్రసాద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.