
పీయూసీ ఉత్తీర్ణత 73 శాతం
శివాజీనగర: 2025వ సంవత్సర ద్వితీయ పీయూసీ పరీక్ష–1 ఫలితాలు ప్రకటించగా 73.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. మంగళవారం బెంగళూరులోని కర్ణాటక పాఠశాల పరీక్ష, మూల్యాంకన నిర్ణయ మండలి కార్యాలయంలో విద్యా మంత్రి మధు బంగారప్ప ఫలితాలను విడుదల చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
ఉడుపి అగ్రస్థానం
● ఉడుపి జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండగా, దక్షిణ కన్నడ 93.57 శాతం ఫలితాలతో 2వ స్థానంలో ఉంది. బెంగళూరు దక్షిణ 85.36 శాతంతో 3వ స్థానంలో ఉన్నది. యాదగిరి జిల్లా 48.45 శాతంతో చివరిలో నిలిచింది.
● గ్రామీణ ప్రాంతాల కంటే నగర ప్రాంతాల విద్యార్థుల ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది.
● 3,45,694 మంది బాలికలు పరీక్ష రాయగా, 2,69,202 మంది ఉతీర్ణులయ్యారు.
● 2,92,111 బాలురు పరీక్ష రాయగా, 1,99,227 మంది పాసయ్యారు.
● కన్నడ మాధ్యమంలో ఉత్తీర్ణత 56.37 శాతం ఉండగా, ఆంగ్ల మాధ్యమంలో ఉత్తీర్ణత శాతం 81.75 శాతం ఉంది.
● 85 శాతం కంటే అధిక మార్కులు పొందినవారు 1,00571, ప్రథమ శ్రేణి అంటే 85 కంటే తక్కువ, 60 శాతం కంటే అధిక మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య 2,78,058 గా ఉంది.
● ఈసారి కన్నడ పరీక్ష 5,414 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారు. అర్థశాస్త్రంలో 613 మంది, కెమిస్ట్రీలో 613 మంది సాధించారు.
● ప్రభుత్వ పీయూ కాలేజీలలో ఉత్తీర్ణత 57.11 శాతం, ఎయిడెడ్ పీయూసీ కాలేజీల ఉత్తీర్ణత 62.69 శాతం, అన్‌ఎయిడెడ్ కాలేజీలలో 82.66 శాతంగా ఉంది. బీబీఎంపీ పీయూ కాలేజీలలో 68.88 శాతం పాసయ్యారు.
● ఎస్సీ విద్యార్థుల్లో 62.43 శాతం, ఎస్టీ విద్యార్థుల్లో 63.07 శాతం పాసయ్యారు. జనరల్‌లో 87 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. దివ్యాంగ విద్యార్థుల ఉత్తీర్ణత 64.40 శాతంగా ఉంది.
ఇక్కడ జీరో ఫలితాలు
● ఈసారి పరీక్షల్లో 8 ప్రభుత్వ పీయూసీ కాలేజీలు, 20 ఎయిడెడ్ పీయూసీ కాలేజీలు, 90 అన్‌ఎయిడెడ్ కాలేజీలు, 5 రెసిడెన్షియల్ పాఠశాల పీయూ కాలేజీలు సున్నా ఫలితాలు పొందాయి.
● సమాధాన పత్రాల మూల్యాంకనం మొత్తం 76 కేంద్రాల్లో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగింది.
● ఫలితాలను వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. అన్ని కాలేజీల్లో కూడా మంగళవారం మధ్యాహ్నం తరువాత ప్రకటించారు.
అందులో బాలికలే అధికం
ఫలితాల విడుదల
విద్యార్థిని ఆత్మహత్య
మైసూరు: ద్వితీయ పీయూసీలో ఫెయిలైన ఆవేదనతో మైసూరు నగరంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళామందిర ఆపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న ఐశ్వర్య (17) అనే అమ్మాయి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈమె ఒంటికొప్పలిలో ఉన్న ప్రభుత్వ పియు కళాశాల్లో సైన్స్ గ్రూపు చదివేది. మంగళవారం ఫలితాలలో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని ఇలా చేసింది.
టాపర్లు వీరే
ఈ ఏడాది 6,37,805 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 4,68,439 మంది ఉత్తీర్ణులయ్యారు. 73.45 శాతం ఉత్తీర్ణత వచ్చింది.
రాష్ట్రస్థాయి టాప్ ర్యాంకులు అమ్మాయిలకే దక్కాయి. సైన్స్‌లో 600కు 599 మార్కులతో అమూల్య కామత్, కామర్స్‌లో 599 మార్కులతో దీపశ్రీ, ఆర్ట్స్‌లో 597 మార్కులతో సంజనా బాయి టాపర్లుగా నిలిచారు.
మొత్తం ఆర్ట్స్ విభాగంలో 53.29 శాతం, వాణిజ్య విభాగంలో 76.03 శాతం, సైన్స్‌లో 82.48 శాతం ఉత్తీర్ణత సాధించారు.
బాలికల ఉత్తీర్ణ శాతం 77.88 శాతం అయితే బాలల ఉత్తీర్ణత శాతం 68.20 శాతమే. రీకౌంటింగ్‌కు ఈ నెల 17లోగా దరఖాస్తు చేయాలి.

పీయూసీ ఉత్తీర్ణత 73 శాతం

పీయూసీ ఉత్తీర్ణత 73 శాతం