
నంజనగూడు భక్తసంద్రం
మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జిల్లాలోని నంజనగూడులో బుధవారం వేలాదిమంది భక్తుల మధ్య శ్రీకంఠేశ్వర స్వామి గౌతమ పంచ మహా రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే రుత్వికులు ఆలయంలో లింగాకారునికి అభిషేకం, వివిధ పూజలను నిర్వహించారు. తరువాత ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం ముందున్న గౌతమ రథంలో ప్రతిష్టించారు. తెల్లవారుజామున 5 నుంచి 5.40 గంటల మధ్య శుభ మీన లగ్నంలో పండితులు నాగచంద్ర దీక్షిత్ పూజలు సమర్పించారు. నంజనగూడు ఎమ్మెల్యే దర్శన్ ధ్రువనారాయణ రథానికి కొబ్బరికాయను కొట్టి శ్రీకారం చుట్టారు. వేలాది మంది భక్తులు జై శ్రీకంఠేశ్వర, నంజుండేశ్వర అంటూ తేరును లాగారు.
వేకువనే శ్రీకంఠేశ్వర రథోత్సవం

నంజనగూడు భక్తసంద్రం