
పూలజ్యోతుల సంభ్రమం
బనశంకరి: ఇతిహాసిక బెంగళూరు ద్రౌపదీ దేవి కరగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున వహ్నికుల క్షత్రియ సముదాయానికి చెందిన మహిళలు ద్రౌపదీదేవికి హారతి దీపాలతో పూజలు చేపట్టారు. తిగళరపేటే ధర్మరాయస్వామి ఆలయానికి వేలాదిగా సుందరంగా అలంకరించిన మల్లె పూల జ్యోతులను మోసుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. హారతి దీపాలతో ద్రౌపదీదేవికి పూజలు నిర్వహించారు. కే.సతీశ్, కరగ పూజారి ఏ.జ్ఞానేంద్ర, బాలకృష్ణ, బీ.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ద్రౌపదీదేవి కరగ ఉత్సవాలు

పూలజ్యోతుల సంభ్రమం