
యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి: దైవదర్శనానికి వెళుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. యాదగిరి జిల్లా వక్రనహళ్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కలబుర్గి తాలూకా ఘత్తరిగి భాగ్యవంతి దేవాలయ దర్శనం కోసం వెళుతుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వక్రనహళ్లి నుంచి బోలెరో వాహనంలో 10 మందికి పైగా వెళుతుండగా యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మద్దరికి సమీపంలో బోలెరో వాహనం, కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో శరణప్ప(30), సునీత(19), సోమవ్వ(50), తంగమ్మ(55) అనే నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ పృథ్వీ శంకర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని యాదగిరి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దైవ దర్శనానికి వెళుతూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుల కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బోలెరో వాహనం, కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీ
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం