
నేటి నుంచి దత్తాత్రేయ ఉత్సవాలు
రాయచూరు రూరల్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతి రూపమే దత్తాత్రేయుడని భక్తుల విశ్వాసం. గురుదేవ దత్తుని మొదటి అవతార పురుషుడు శ్రీ వల్లభ స్వామి. కర్మభూమిలో ద్వీపకల్పంలో నివసించిన నాథుడుగా కురువపుర శ్రీవల్లభ నాథుడు ప్రసిద్ధి చెందాడు. రాయచూరు తాలూకా సరిహద్దుల్లోని కురవపుర కృష్ణా నది మధ్యలో వెలసింది. అక్కడ హనుమ జయంతికి ప్రత్యేక ఉత్సవాలు చేపడుతున్నారు. రాయచూరు నుంచి 25 కి.మీ.ల దూరంలో ఉన్న కురువపురకు బస్సులో వెళ్లి అక్కడ నుంచి నదిలో కి.మీ.దూరం తెప్పలో ప్రయాణించి భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. తెలంగాణలోని మక్తల్ నుంచి కూడా కురువపురకు తరలి వస్తారు. తాలూకాలోని నారదగడ్డలో వెలసిన శ్రీ పాదవల్లభ దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం భక్తులు బూడిదపాడు, ఆత్కూరు, దొంగరాంపూర్‌ల నుంచి పెద్ద సంఖ్యలో కృష్ణా నదిలో తెప్పల్లో వెళతారు.
ప్రత్యేకత సంతరించుకున్న కురువపుర వల్లభ నాథుడు
నేడు హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు

నేటి నుంచి దత్తాత్రేయ ఉత్సవాలు

నేటి నుంచి దత్తాత్రేయ ఉత్సవాలు