
ఉపాధి హామీ పనుల కోసం ధర్నా
రాయచూరు రూరల్: ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలకు పనులు కేటాయించాలని మానవ హక్కుల సంరక్షణ అధ్యక్షుడు రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. నరేగ పనుల్లో లోపాలను సవరించాలని, అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కూలీ కార్మికుల పేరుతో గోల్‌మాల్ చేయడంలో అధికారులది అందె వేసిన చెయ్యిగా మారిందన్నారు. కాలువల్లో పూడికతీత పనులకు వ్యవసాయ కూలీ కార్మికులు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డూప్లికేట్ ఫొటోల కోసం ఎన్‌ఎంఎంఎస్‌లకు కార్మికుల హాజరు పట్టికను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉందని, ఈ తతంగానికి అధికారులు నరేగ పనులు చేపట్టారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.