
ఉత్సాహంగా క్రికెట్ పోటీలు
బళ్లారిటౌన్: కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు హాసన నగరంలో శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 22 జట్లు పాల్గొనగా, తొలి రోజున 3 గంటల వరకు క్రికెట్ ఫోటీలు జరిగాయి. వర్షం కురవడంతో అర్ధంతరంగా నిలిచి పోయాయి. ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. తొలి రోజున ప్రారంభం అయిన ఈ క్రికెట్ పోటీలను హాసన ఎంపీ శ్రేయస్ పాటిల్, మాధ్యమ సలహాదారుడు కేవీ ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు వర్కింగ్ జరల్నిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు, ప్రధాన కార్యదర్శి లోకేష్, మదనగౌడ, జిల్లాధ్యక్షుడు వేణుకుమార్ తదితరులు ప్రారంభించి మాట్లాడారు. విలేకరులు తమ వార్తల సేకరణతో పాటు ఇలాంటి క్రీడల్లో పాల్గొనాలని పలువురు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర స్థాయి విలేకరులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.
సవదత్తి యల్లమ్మ దేవికి ప్రత్యేక పట్టు చీర
●బంగారు లేపనపు చీరను కానుకగా సమర్పించిన స్వామీజీ
రాయచూరు రూరల్: 70 ఏళ్ల క్రితం కన్న కలలకు నేడు అంకురార్పణ లభించడంతో సవదత్తి యల్లమ్మ దేవికి పట్టు చీరను బహూకరించినట్లు రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా వీరగోటె అడవిలింగ మహాస్వామీజీ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం బెళగావి జిల్లా సవదత్తిలోని యల్లమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారు లేపనంతో కూడిన ప్రత్యేక పట్టు చీరను కానుకగా అర్చకుల చేతుల మీదుగా సమర్పించారు.
వక్ఫ్‌బిల్లుపై వ్యాఖ్యలు.. ఇద్దరు అరెస్ట్
సాక్షి,బళ్లారి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లును ఆమోదింపజేసినందున వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఇద్దరిని దావణగెరె పోలీసులు అరెస్ట్ చేశారు. దావణగెరెలోని మాజీ కార్పొరేటర్ కబీర్‌ఖాన్‌తో పాటు మరో ఇద్దరు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి, కబీర్‌ఖాన్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
అకాల వర్షానికి
పంటనష్టం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం సంభవించింది. మాన్వి, మస్కి, దేవదుర్గ, సింధనూరు తాలూకాల్లో వేలాది ఎకరాల్లో పంట నేల పాలైంది. శనివారం మస్కి శాసన సభ్యుడు బసనగౌడ తుర్విహాళ అకాల వర్షం వల్ల తాలూకాలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. మస్కి తాలూకా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కరుణించకుండా కాటు వేశాడని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. తహసీల్దార్‌కు నష్టం అంచనాను తయారు చేసి సర్కార్‌కు నివేదిక పంపాలని ఆదేశించారు.
80 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
రాయచూరు రూరల్: నగరంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు జరిపి 80 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రైల్వే స్టేషన్ వద్ద మంగళవారపేట కాలనీ రవి, రాముల నుంచి 80 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

ఉత్సాహంగా క్రికెట్ పోటీలు