
అవార్డు నా బాధ్యతను పెంచింది
హొసపేటె: బెంగళూరులోని కర్ణాటక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో విజయనగర జిల్లా హొసపేటె తాలూకా తుంగభద్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యురాలు పార్వతి సేవలకు గుర్తింపుగా ఛాయాశ్రీ అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లోని ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సంజయ్‌కుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. అవార్డును స్వీకరించిన తర్వాత పార్వతి మాట్లాడుతూ ప్రతి రోజూ కష్టపడి పని చేసే వారికి ఇలాంటి అవార్డులు ఇవ్వాలని అన్నారు. అప్పుడే వారికి వృత్తిపై బాధ్యత పెరుగుతుందన్నారు. ఛాయాశ్రీ అవార్డు అందుకోవడం నాకు లభించిన వరం. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందని ఆమె అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి
హుబ్లీ: ద్విచక్ర వాహనాన్ని కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎరబలి గ్రామం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడిని మంజునాథ్(35)గా గుర్తించారు. భార్య పుట్టింట్లో ప్రసవానికి మచ్చురళ్లికి వెళ్లింది. మంజునాథ్ 20 రోజుల శిశువు, భార్యను చూసుకొని రాత్రి తిరిగి బైక్‌లో వస్తుండగా తుమకూరు వైపు నుంచి మనసూరళ్లికి వెళుతున్న ఆర్టీసీ బస్సు, బైక్ ముఖాముఖిగా ఢీకొన్నాయి. ఘటన విషయం తెలియగానే బేలూరు స్టేషన్ ఎస్‌ఐ నాగరాజ్ తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని తదుపరి చర్యలను చేపట్టారు.
అప్పుల బాధ తాళలేక
రైతు ఆత్మహత్య
రాయచూరు రూరల్: అప్పుల బాధ తాళ లేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని జేవర్గి తాలూకా సొన్న గ్రామానికి చెందిన రైతు కరెప్ప పూజారి(58)గా పోలీసులు గుర్తించారు. పొలం కౌలుకు తీసుకోవడంతో మూడేళ్ల నుంచి పంటలు పండక పోవడంతో వాణిజ్య బ్యాంకుల్లో రూ.5 లక్షల మేర రుణాలు తీసుకున్నారు. బ్యాంకు అధికారులు తీసుకున్న రుణాలను చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పుష్కరిణిలో పడి
బాలుడు దుర్మరణం
రాయచూరు రూరల్: కాలు జారి పుష్కరిణిలో పడి అభిషేక్(8) అనే బాలుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. విజయపుర నుంచి దైవ దర్శనం కోసం గురుగుంట అమరేశ్వర ఆలయానికి వచ్చిన కుటుంబం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో స్నానం కోసం దిగారు. బాలుడు పైభాగంలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కాలు జారి పుష్కరిణిలో పడి మరణించాడు.
తారానాథ్ సేవలు చిరస్మరణీయం
హుబ్లీ: ఎవరిపైనా పక్షపాతం చూపకుండా అందరిని కలుపుకొని పోయే పండిత్ రాజీవ్ తారానాథ్ మాటలు తనను ఆకర్షించాయని, ఆయన మాటలు వింటూనే తాను ఆయన శిష్యుడిగా మారిపోయానని సీనియర్ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర్ కంబార అన్నారు. ధార్వాడ సృజన రంగమందిరంలో పండిత్ రాజీవ్ తారానాథ మెమోరియల్ ట్రస్ట్, జీబీ జోషి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తారానాథ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. సంగీత సాహిత్య రంగాలకు పండిత్ రాజీవ్ తారానాథ్ అందించిన సేవలు అపారం అన్నారు. ఆయన ఓ మేధావి అని, ఎప్పుడు గలగలా మాట్లాడుతూ అందరి ప్రేమ, స్నేహాలను దక్కించుకున్న అపూర్వ వ్యక్తిత్వం ఆయనది అన్నారు. ఉత్తర, దక్షిణ కర్ణాటక అన్న భేదం లేకుండా అందరితో కలిసిన సమగ్ర కర్ణాటక, అఖండ భారతం మాటలను సదా మాట్లాడేవారు. గురువుపై అపారమైన గౌరవం కలిగిన పండిత్ రాజీవ్ తారానాథ్ ఓ గురువుగా ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారన్నారు. హిందూ ముస్లిం భేదభావాలు లేకుండా శిష్యులందరికీ చక్కటి మార్గదర్శనం చేసి కీర్తి గడించారన్నారు. సదరు పుస్తకం గురించి డాక్టర్ బసవరాజ్ కల్గుడి మాట్లాడారు. రాజీవ్ తారానాథ్ జీవితంపై నిర్మించిన సాక్ష్య చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ వేణుగాన వాదకులు పండిత్ ప్రవీణ్ గోడ్ఖిండి వేణుగానం అందరిని మంత్రముగ్ధులను చేసింది. పద్మశ్రీ పండిత్ వెంకటేష్ కుమార్, సాహితీవేత్త కాకండికి, డాక్టర్ రమాకాంత్ జోషి, డాక్టర్ బసవరాజ్ కల్గుడి, సమీర్ జోషి, ఉదయ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

అవార్డు నా బాధ్యతను పెంచింది

అవార్డు నా బాధ్యతను పెంచింది

అవార్డు నా బాధ్యతను పెంచింది