
5 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయి
మైసూరు: చామరాజనగర జిల్లాలో మైసూరు మహారాజులకు సుమారు 5 వేల ఎకరాల భూములు ఉన్నాయి. అన్ని రకాల పత్రాలు మా వద్ద ఉన్నాయి, ఆ భూములను సాగుచేసుకుంటున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించం అని మైసూరు రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయార్ అన్నారు. సోమవారం మైసూరు ప్యాలెస్‌లోని తమ నివాసంలో మీడియా సమావేశం భూముల విషయమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆ జిల్లాలో ఉన్న భూముల గురించి 1950లోనే జిల్లాధికారికి, సర్కారుకు లేఖ రాశం, అన్ని దాఖలాలను 2014లో అందజేశాం. 4,500 ఎకరాల కంటే ఎక్కువగా భూములకు చెందిన రికార్డులు తమ వద్ద భద్రంగా ఉన్నాయని తెలిపారు. వాటి ఆధారంగా భూములకు ఖాతా చేసి ఇవ్వాలని లేఖ రాశామన్నారు. దీని వల్ల రైతులకు ఎలాంటి భయం వద్దని తెలిపారు. ఆ భూమి కావాలని ఎవరూ రైతులను బెదిరించరని, అనుమానాలు ఉంటే తనను నేరుగా కలవవచ్చని ఆమె భరోసా ఇచ్చారు. మైసూరు మహారాజులు ప్రజల కోసం దానంగా ఇచ్చిన భూములను తాము లాక్కోవడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ భూములను ప్రభుత్వం రెవెన్యూ భూములుగా చేయాలని చూస్తోంది. ఆ భూములు ఉంటే రైతుల వద్ద ఉండాలి, లేదా మా వద్ద ఉండాలి అంతే తప్ప ప్రభుత్వం వద్ద కాదు అని స్పష్టంచేశారు. ఆ భూములను రెవెన్యూ ఖాతాలోకి చేయరాదని పేర్కొన్నారు.
రైతుల నుంచి భూములను తీసుకోం
రాజమాత ప్రమోదాదేవి