
ఉత్తమ సేవలకు అవార్డుల ప్రదానం
శివాజీనగర: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని సమాజంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సాధకులను గుర్తించి ఐదు మందికి అవార్‌ుడ్స అండ్ డాక్టరేట్ ఫోరమ్ రాష్ట్ర శాఖ ద్వారా నేషన్స్ ప్రైడ్ అవార్డును ప్రదానం చేశారు. సోమవారం హుబ్లీలోని గాంధీవాడ ఏబీఎం తెలుగు చర్చిలో జరిగిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఉత్తమ సమాజ సేవకుడిగా గుర్తింపు పొందిన సాల్మన్‌రాజ్‌కు, ఉత్తమ గాయకుడు ఆనందరావు పంబా, ఉత్తమ మ్యూజిషియన్ షడ్రక్ జుంజు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సమాజ సేవకుడు టీ.జెర్మియా, ఉత్తమ గాయకుడు, సమాజ సేవకుడు విజయ భాస్కర్ మలాపురంలకు ఈ సంవత్సరం నేషన్స్ ప్రైడ్ అవార్డు అందించారు. ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వారిని గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ పెండెమ్ దానియేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాబ్రియేల్ పిళ్‌లై, రెవరెండ్ డెవిడ్‌సన్, రెవరెండ్ జాన్ మరికంటి, డీ.సాముయేల్ పాల్గొన్నారు.