
బెళగావిలో పట్టాలు తప్పిన గూడ్స్
సాక్షి, బళ్లారి: బెళగావి నగర రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం ఉదయం బెళగావి నుంచి హుబ్లీ వైపు వెళుతున్న గూడ్స్ రైలులో మూడు వ్యాగన్లు పక్కకు తప్పాయి. ఈ గూడ్స్ ఇనుప ఖనిజంతో ప్రయాణిస్తోంది. స్టేషన్ సమీపంలో మిలిటరీ మహాదేవ్ ఆలయం వద్ద పెద్ద శబ్ధంతో పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మొత్తం రైలు సర్వీసులను నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టారు.