
సీఈటీకి సర్వం సిద్ధం
బనశంకరి: ఇంజనీరింగ్, అగ్రి తదితర కోర్సుల ప్రవేశానికి కర్ణాటక పరీక్షా ప్రాధికార నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ)–2025కి రంగం సిద్ధమైంది. హొరనాడు, గడినాడు కన్నడిగులకు మంగళవారం కన్నడ భాష పరీక్షను బెంగళూరు, మంగళూరు, విజయపుర, బెళగావి నగరాల్లో మొత్తం ఐదు కేంద్రాల్లో నిర్వహించారు. బుధవారం ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు జరుగుతాయని డైరెక్టర్ హెచ్.ప్రసన్న విలేకరులతో తెలిపారు. 775 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందని తెలిపారు.
గంటన్నర ముందే రావాలి
బుధవారం నుంచి మూడురోజులపాటు సీఈటీ పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తారు. గేటు వద్దనే పోలీసులు అభ్యర్థులను తనిఖీలు చేసి అనుమతిస్తారు. కనీసం ఒకటిన్నరగంట ముందుగా పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. విద్యార్థినీ విద్యార్థులు డ్రెస్‌కోడ్‌ను పాటించాలి, సరళమైన దుస్తులను ధరించి రావాలి. మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకూడదు. నగలు, వాచ్‌లను కూడా అనుమతించరు.
నేటి నుంచి 3 రోజులు పరీక్షలు
రాష్ట్రంలో 775 సెంటర్లు
స్కానింగ్, సీసీ కెమెరాల నిఘా
తొలిసారి
స్కానింగ్
మొదటిసారిగా స్కానింగ్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షాకేంద్రాల్లో అభ్యర్థి ముఖాన్ని, హాల్‌టికెట్‌ను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సక్రమమేనని నిర్ధారణ అయితేనే అనుమతిస్తారు. నకిలీ అభ్యర్థుల ఏరివేతకు ఇది దోహదపడుతుందని తెలిపారు. సీట్ బ్లాకింగ్‌తో సాటు ఇతర అక్రమాల అడ్డుకట్టకు ఉపయోగపడుతుందని చెప్పారు.

సీఈటీకి సర్వం సిద్ధం