డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు

Apr 16 2025 12:12 AM | Updated on Apr 16 2025 12:12 AM

డ్రగ్

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు

బనశంకరి: బెంగళూరు నగరంలో డ్రగ్స్‌ మహమ్మారి ఎంతగా వేళ్లూనుకుపోయిందో తరచూ నిందితుల అరెస్టులతో బయటపడుతోంది. దొరికేది కొందరే అయితే దొరకనివారు చాలా మందే ఉంటారని అనుకోవచ్చు. ఐటీ బీటీ వర్గాలు, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ను అమ్ముతున్నారు. విదేశీ పర్యాటకుడు, కేరళ సివిల్‌ ఇంజినీర్‌తో పాటు 10 మంది డ్రగ్స్‌ పెడ్లర్లను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.6 కోట్ల 80 లక్షల విలువచేసే డ్రగ్స్‌ను, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగర పోలీస్‌ కమిషనర్‌ బీ.దయానంద్‌ వివరాలను వెల్లడించారు.

సివిల్‌ ఇంజినీరు.. గంజాయి దందా

ఎలక్ట్రానిక్‌ సిటీ ఫేజ్‌–2లో డీమార్ట్‌ వెనుకభాగంలో గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసి దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి 3.5 కేజీల హైడ్రోఫోనిక్‌ గంజాయిని, రూ.26 లక్షల నగదు, మొబైల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇతనిని ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా కేరళ కు చెందిన జిజో ప్రసాద్‌ అని, సివిల్‌ ఇంజినీర్‌గా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. బొమ్మసంద్ర అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఇతను కేరళ నుంచి

హైడ్రోఫోనిక్‌ గంజాయిని తీసుకువచ్చి ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎలక్ట్రానిక్‌ సిటీ, బొమ్మసంద్రలలో అమ్మేవాడు. 100 గ్రాముల ప్రకారం చిన్న ప్యాకెట్లుగా చేసి బ్యాగులో పెట్టుకుని ఐటీ ఉద్యోగిలా కనిపిస్తూ వ్యాపారం చేసేవాడు. ఓ గ్రాము హైడ్రోఫోనిక్‌ గంజాయిని రూ.12 వేల ధరకు విక్రయించేవాడు.

విదేశీ డ్రగ్స్‌ పెడ్లర్‌

ఆఫ్రికా నుంచి వచ్చిన విదేశీయుడు సోపురు చుక్విని పోలీసులు అరెస్ట్‌చేసి ఇతడి వద్ద నుంచి కిలో ఎండీఎంఏ (ఎక్స్‌టసీ) క్రిస్టల్‌, మొబైల్‌, ద్విచక్రవాహనంతో పాటు రూ.2 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. బేగూరులో దందా చేస్తున్నాడని తెలిసి అరెస్ట్‌ చేశారు. 2012లో వ్యాపార వీసాతో భారత్‌కు చేరుకుని విలాసాలు, అధిక డబ్బు సంపాదన కోసం బెంగళూరులో మకాం వేశాడు. తెలిసినవారి నుంచి ఎండీఎంఏ క్రిస్టల్‌ అనే మత్తు పదార్థాన్ని తక్కువ ధరతో కొనుగోలుచేసి వాటిని ఒక గ్రాము రూ.20 వేల ధరతో కాలేజీ విద్యార్థులకు, ఐటీ బీటీ ఉద్యోగులకు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. నకిలీ రికార్డులు సృష్టించి దేశంలో మకాం వేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు విదేశాంగశాఖ ఆఫీసుకు లేఖ రాశారు.

కేరళ ముఠా అరెస్టు

సులభంగా ఆర్జన కోసం యువత డ్రగ్స్‌ విక్రయాల బాట పడుతోంది. యలహంక ఉపనగర అట్టూరు లేఔట్‌లోని లాడ్జిలో కేరళ కు చెందిన 8 మంది డ్రగ్స్‌పెడ్లర్లు ఎండీఎంఏ క్రిస్టల్‌ విక్రయిస్తున్నట్లు తెలిసి దాడి చేసి నిర్బంధించారు. 110 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్‌, 10 మొబైల్స్‌, ట్యాబ్‌, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రం, రెండు కార్లతో కలిపి పాటు రూ.27 లక్షల విలువచేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్‌ తెలిపారు. ఈ ముఠా ఒకగ్రాము ఎండీఎంఏని రూ.15 వేల నుంచి 20 వేల ధరతో అమ్మేవారు.

బెంగళూరులో 10 మంది

డ్రగ్స్‌ పెడ్లర్ల అరెస్ట్‌

రూ.6.80 కోట్ల విలువచేసే

సొత్తు స్వాధీనం

నిందితుల్లో విదేశీయుడు,

సివిల్‌ ఇంజినీరు

ఈజీ మనీ కోసం యువత అడ్డదారులు

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు 1
1/4

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు 2
2/4

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు 3
3/4

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు 4
4/4

డ్రగ్స్‌ బాగోతం గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement