ఖమ్మం మామిళ్లగూడెం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని పక్షంలో మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హెచ్చరించారు. రైతాంగం సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యాన నిర్వహించిన ‘రైతు సత్యాగ్రహ దీక్ష‘లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా రుణమాఫీ సంపూర్ణంగా అమలుచేయకపోవడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. అంతేకాక పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇక ధరణి పోర్టల్ సమస్యలపైనా స్పందించడం లేదన్నారు. ఈ దీక్షలో బీజేపీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు నాయకులు నున్నా రవికుమార్, శ్యామ్ రాథోడ్, చావా కిరణ్, చిలుకూరి రమేష్, ఏనుగుల వెంకటరెడ్డి, సీతారాంనాయక్, చిందల శ్రీనివాసరావు, జంపన్న సీతారామరాజు, ఓలా రాజు, బిక్షపతి, బాలు నాయక్, శ్రీనివాసరెడ్డి, పసుమర్తి సతీష్, భూక్య వెంకన్న, ఎల్లారావు గౌడ్, నరికుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి