ప్రభుత్వాలు మారుతున్నా గ్రామాల్లో ప్రజల తాగునీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్నామని, మారుమూల గ్రామాల్లో సైతం నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఏజెన్సీలోని గ్రామాల్లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పైపులైన్లకు లీకేజీ ఏర్పడి తాగునీరు వృథాగా పోతోంది. మరికొన్ని గ్రామాల్లో వారానికి రెండు మూడు సార్లు మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు చేతిపంపులు, బావులు, వాగులపైనే ఆధారపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో జీపీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా మరికొన్ని గ్రామాల్లో ఎడ్లబండ్లలో డ్రమ్ముల ద్వారా నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి పరిస్థితిపై ‘సాక్షి’ బుధవారం పలు గ్రామాలను సందర్శించగా కనిపించిన గ్రామీణుల నీటి కష్టాలు ఇవీ.
Comments
Please login to add a commentAdd a comment