సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం కృషి చేయాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి కోరారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఏఐటీయూసీ స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి జీఎం నరేందర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. తిరుపతి మాట్లాడుతూ ఖాళీలతో సంబంధం లేకుండా టైంబాండ్ ప్రకారం ఈపీ ఆపరేటర్లకు సీ, బీ, ఏ గ్రేడ్‌లు అందించాలని అన్నారు. గోలేటి నుంచి ఎక్స్‌రోడ్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రీవేబిన్‌లో పనిచేసే ఉద్యోగులకు పీడబ్ల్యూబీ అటెండర్‌గా ఉద్యోగ శిక్షణను మా ర్చాలని, కై రిగూడ ఓసీపీ, గోలేటి సీహెచ్‌పీ, వర్క్‌షాప్‌ల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు శిక్షణ, ప్రమోషన్లలో మార్పులు కల్పించాలన్నారు. గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలని కోరారు. గోలేటి డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలు, స్టాఫ్ నర్సులను నియమించాలని డిమాండ్ చేశారు. సీఈఆర్ క్లబ్‌లో టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ కోసం ప్రత్యేక హాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కమిటీ సభ్యులు జగ్గయ్య, రాజేష్, ఆనంద్, మారం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment