అందరి బంధువు.. సేవాలాల్
● బంజారాల ఆరాధ్య దైవం ● జిల్లా కేంద్రంలో నేడు జయంత్యుత్సవాలు ● ఏర్పాట్లు పూర్తిచేసిన ఉత్సవ కమిటీ సభ్యులు
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంత్యుత్సవాలు శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వాహకులు ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నా రు. కర్నాటక రాష్ట్రంలోని స్వర్ణగుంప గుత్తి గ్రామంలో 1,739 ఫిబ్రవరి 15న భీమానాయక్, ధర్మణి దంపతులకు సేవాలాల్ జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలో ఉంది. మూగజీవాల ప్రాణదాతగా సేవాలాల్‌కు పే రుంది. మోరమ్మగా పిలువబడే జగదాంబ అమ్మవా రు ప్రత్యక్షమై సేవాలాల్‌ను అప్పజెప్పాలని భీమానాయక్‌ను కోరిందని భక్తులు చెబుతుంటారు. తల్లి దండ్రులు ఒప్పుకున్నా సేవాలాల్ నిరాకరించడంతో ఆయనతోపాటు తండావాసులను కష్టాలకు గురిచేసింది. ఈ కారణంతో తండావాసులు ఆయనను బహిష్కరిస్తారు. అమ్మవారిని శాంతింపజేసేందుకు ఏడు మేకలు బలి ఇచ్చేందుకు సిద్ధపడతారు. మూగజీవాలను బలిచ్చేందుకు ఒప్పుకోని సేవాలా ల్.. తన తలను అమ్మవారి సమర్పిస్తారు. మూగజీవాల పట్ల సేవాలాల్‌కు ఉన్న ప్రేమ, భక్తికి ప్రతి రూపంగా జగదాంబదేవి అతడికి తిరిగి జీవం పోసిందని నమ్ముతారు. అప్పటి నుంచి సేవాలాల్ దుర్గామాతను మార్గదర్శకురాలిగా భావించి దేవి అడుగుజాడల్లో నడుస్తారు. బంజారాల సేవలో ని మగ్నమయ్యాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేపట్టారు. భక్తులు ఈ నెల 26 నుంచి సేవాలాల్ దీక్షలు ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లు ముమ్మరం
సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సుమారు రెండు వేల మంది లంబాడాలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కుమురంభీం ఆసిఫాబాద్ మినహా అన్నిజిల్లాల్లో ఇప్పటికే సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించారు. ఈ నెల 15 నుంచి జిల్లాలోని అన్ని తండాల్లో సేవాలాల్ జయంత్యుత్సవాలు జరిపారు. శనివారం ఉదయం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రేమలా గార్డెన్ సమీపంలో ఉదయం 11 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి పూజా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సేవాలాల్ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, గౌరవ అధ్యక్షుడు రాథోడ్ శంకర్‌నాయక్ వెల్లడించారు. కలెక్టర్ సైతం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే సేవాలాల్ జయంతి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రజలు, ప్రముఖ నేతలందరూ హాజరువుతున్నారు. సుమారు రెండు వేల వరకు బంజారా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రజలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– రాథోడ్ శంకర్‌నాయక్,
ఉత్సవ కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడు
అందరి బంధువు.. సేవాలాల్
Comments
Please login to add a commentAdd a comment