విచారణలో వేగం పెంచాలి
● పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ శ్రీనివాస్‌రావు
ఆసిఫాబాద్‌అర్బన్: పోక్సో, గ్రేవ్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పించాలని, సైబర్ క్రైమ్, ‘డయల్ 100’ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రిపీటెడ్‌గా నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీలు ప్రభాకర్‌రావు, చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment