సభ సక్సెస్ చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్రీయ పర్దన్ ఉత్తన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్రం వందన పి లుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వర్దన్ కులస్తులకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్దన్ కులస్తులకు గుర్తింపు కోసమే బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కులస్తులంతా అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు, రాయిసిడాం భూదాబాయి, నాయకులు దేవురావ్, తిరుపతమ్మ, నందిని తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment