గూండా రాజకీయాలు చెల్లవు
బెజ్జూర్: సిర్పూర్ నియోజకవర్గంలో గూండా రాజకీయాలు ఇక చెల్లవని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి అధికారం కోసమే చేరాడని ఆరో పించారు. పార్టీని వదిలేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని అధినేత కేసీఆర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రంతో పా టు ఆయా గ్రామాల్లోని విలువైన ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తు న్నా సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం మండల కేంద్రంలో మాలీ, గిరిజనుల సంక్షేమ భవనాల కోసం అధికారులు భూములు కేటాయించగా ప్రభుత్వ నిధులతో భవన నిర్మాణాలు పూర్తయినా స్థానిక తహసీల్దార్ అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. కబ్జాలకు పాల్పడే వ్యక్తులు, వారికి సహకరిస్తున్న అధికారులపై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలో పాత పోలీస్‌స్టేషన్ ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని అక్రమంగా వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల పంట చేలలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు సారయ్య, యూత్ అధ్యక్షుడు తిరుపతి, పార్టీ నాయకులు మోహన్, రాజు, ఇస్తారి, బాబు, దేవయ్య తదితరులున్నారు.
● బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment