పౌష్టికాహారం అందించాలి
లింగాపూర్: చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మండలంలోని గుమ్నూర్ (బీ) అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిష్టర్లు, సరుకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారు ల మానసిక, శారీరక ఎదుగుదలను ఎప్పటికప్పు డు గమనించాలని సూచించారు. పోషకాహార లోపంతో బాధపడే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి సరఫ రా అవుతున్న సరుకులను సకాలంలో పంపిణీ చే యాలని ఆదేశించారు. ఎండలు ముదురుతుండడంతో ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని సూచించారు. మిషన్ భగీరథ అధికారులు ప్రతీ గ్రామంలో పర్యటించి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సి ర్పూర్(యూ) మండల కేంద్రంలోని మిషన్ భగీర థ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. నిత్యం ప్రతీ గ్రా మానికి సక్రమంగా నీళ్లు అందేలా చూడాలని అధి కారులను ఆదేశించారు. ఐటీడీఏ ఏఈ ఇందల్, ఎంపీడీవో రామచందర్, ఎంపీవో రజనీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నరేశ్, ఏఈ అరవింద్, సీడీపీవో ఇందిరా, ఏపీవో చంద్రయ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment