సేవాలాల్ సేవలు చిరస్మరణీయం
ఆసిఫాబాద్‌అర్బన్: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ సేవలు చిరస్మరణీయమని దీక్ష గురువు ప్రేమ్‌సింగ్ మహరాజ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రేమలా గార్డెన్స్ ఆవరణలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శివప్రసాద్ అధ్యక్షతన అధికారికంగా సేవాలాల్ జయంత్యుత్సవా లు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీసీసీ అ ధ్యక్షుడు విశ్వప్రసాద్‌తో కలిసి ప్రేమ్‌సింగ్ మహరా జ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు కోసం సేవాలాల్ అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ధర్మ ప్రచారం, కమ్యూనిటీ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో హాజరైనప్పుడే సమస్యలు తెలుస్తాయని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ మాట్లాడారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బంజారా భవనాలు పూర్తయినా ఆసిఫాబాద్‌లో పూర్తి కాకపోవడమే బంజారాల్లో ఐకమత్యం లోపించిందనడానికి నిదర్శనమని చెప్పారు. అంతకుముందు తీజ్ ఉత్సవాల్లో భాగంగా బంజారా మహిళలు అధికసంఖ్యలో జిల్లా కేంద్రంలో ర్యాలీ, భోగ్ బండార్ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు శంకర్ నాయక్, రవినాయక్, కిరణ్‌నాయక్, గోపాల్‌నాయక్, ఉత్తమ్‌నాయక్, అనిల్‌జాదవ్, రవీందర్, నరేశ్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకల్లో ప్రొటోకాల్ రగడ
జిల్లా కేంద్రంలోని ప్రేమలా గార్డెన్స్ ఆవరణలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాల్లో ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. ప్రభు త్వ కార్యక్రమం కావడంతో సభా వేదికకు చైర్మన్‌గా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో చిన్నదిగా ఉండడాన్ని తప్పుపట్టారు. మహనీయని జయంతి వేడుకల్లో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వేడుకలను బహిష్కరిస్తున్నట్లు చెప్పి వేదిక నుంచి వెళ్లిపోయారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఎమ్మెల్యే వినలేదు.
Comments
Please login to add a commentAdd a comment