నీళ్లకు గోసైతంది
భగీరథ నీళ్లురాక ఐదారు రోజులైతంది. ఊళ్లె ఉన్న బోరింగ్ వద్దకు పోయి తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటున్నం. పెద్దవాగు బ్రిడ్జి వద్ద పని జరుగుతందని నీళ్లు సరఫరా చేస్తలేరు. ఎండాకాలం నీళ్లకు గోస కాకుండా పెద్దసార్లు జెర దయ చూపాలె.
– సుశీల, ఇట్యాల, దహెగాం
భగీరథ నీరు సరఫరా చేయాలి
గ్రామంలో 20 కుటుంబాల వరకు ఉన్నాయి. మిషన్ భగీరథ నల్లాలు లేక పంట చేనులో ఉన్న బావినీరు తెచ్చుకుంటున్నాం. గ్రామస్తులమంతా ఒకే బావిపై ఆధారపడుతున్నాం. ఎండలు పెరిగే కొద్ది బావిలో నీరు అడుగంటిపోతుంది. వర్షాకాలంలో మురుగునీటినే అన్నింటికీ వాడుకోవాల్సి వస్తోంది. భగీరథ నీటిని సరఫరా చేయాలి.
– బూత రాజక్క, మచ్చగూడ, వాంకిడి
అధికారులు స్పందించాలి
గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్లు పగిలి కొన్నినెలలు అవుతోంది. అధికారులకు విన్నవిస్తే నీటి సరఫరా బాధ్యత జీపీలదే అంటున్నారు. అధికారులు స్పందించాలి.
– పతంగే లింబాదాస్,
మాజీ సర్పంచ్, ముకదంగూడ, కెరమెరి
వారానికి రెండుసార్లే..
కంచన్‌పల్లితో పాటు మోతీపటార్ గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు వారానికి రెండుసార్లు మాత్రమే వస్తుంది. అవికూడా కొన్ని ఇళ్లకు మాత్రమే అరకొరగా వస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నాం.
– లాల్‌షావ్, కంచన్‌పల్లి, లింగాపూర్
నీళ్లకు గోసైతంది
నీళ్లకు గోసైతంది
నీళ్లకు గోసైతంది
Comments
Please login to add a commentAdd a comment