‘వీవోఏపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’
దహెగాం: ఐకేపీలో వీవోఏగా విధులు నిర్వహిస్తున్న పడాల రాజ్‌కుమార్ గౌడ్‌పై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్న క్రమంలో చప్పిడి విలాస్ వచ్చి దాడి చేశారన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ నిరసనలో సీఐటీయూ కమిటీ సభ్యులు క్రిష్ణమాచారి, రోజా, ఆయా మండలాల వీవోఏలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment