చేతిపంపులే ఆధారం
కెరమెరి: మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ముకదంగూడ గ్రామంలో 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్లు వేసినప్పటికీ పలుచోట్ల లీకేజీ కావడంతో నీరంతా వృథాగా పోతోంది. దీంతో గ్రామస్తులకు నీరు సరిపోవడంలేదు. గ్రామంలో మూడు చేతిపంపులు ఉన్నప్పటికీ రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్లకు మరమ్మతులు చేయించి నీటిని సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రోడ్డుపై పారుతున్న మిషన్ భగీరథ నీరు
Comments
Please login to add a commentAdd a comment