సమీకృత గురుకులాల ఏర్పాటుకు చర్యలు
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా జిల్లాలో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు గురువారం ఆర్డీవో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ రియాజ్ ఆలీతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భవన సముదాయాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించామని తెలిపారు.
‘పీఎంశ్రీ’ పనుల్లో వేగం పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: పీఎం శ్రీ పథకంలో ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీఎంశ్రీ పథకంలో ఎంపికైన 18 పాఠశాలల్లో మార్చిలోగా వందశాతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో గమానియల్, ఎస్‌వో అబిద్ అలీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment