పదోన్నతులు వచ్చేనా..?
ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు.. అప్పుడు అంటూ ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో పలువురిలో నిరాశ వ్యక్తమవుతోంది. అన్ని క్యాడర్లలో ఉన్నతి కోసం నిరీక్షిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఈ సమస్య ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ చేపడతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రక్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న పలు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆబ్కారీ శాఖలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో అప్పట్లో నిలిచిపోయింది. దీంతో పలువురు ఈ పదోన్నతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎకై ్సజ్ అధికారి పోస్టు డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఖాళీగా ఉంది. కరీంనగర్ డీసీ రవికాంత్ ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పలువురు అసిస్టెంట్ కమిషనర్లకు పదోన్నతి ఆస్కారం ఉండడంతో ఒకవేళ ప్రక్రియ జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి డీసీ పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ పోస్టు కూడా ఖాళీగా ఉండగా ఆదిలాబాద్ డీపీఈవో హిమశ్రీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ ఎకై ్సజ్ పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా టాస్క్‌ఫోర్స్ విభాగాలకు సంబంధించి రెండు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాకుండా ఉమ్మడి జిల్లాలో 2 సీఐ పోస్టులు, 9 హెడ్ కానిస్టేబుల్, 17 ఎకై ్సజ్ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు మినిస్టీరియల్ ఉద్యోగులు కూడా పదోన్నతులు, బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.
పలు ఎస్సై పోస్టులు ఖాళీ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు మూడువైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. దీంతో దేశీదారు అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. దీన్ని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించా ల్సిన ఎస్సైతో పాటు పలు కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయం ఆ శాఖలో ఉంది. ఒకవైపు ప్రభుత్వం దేశీదారు, గుడుంబా నియంత్రణకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉండడం ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఆబ్కారీ శాఖలో ఎదురుచూపులు
అన్ని క్యాడర్లలో ఉన్నతి కోసం నిరీక్షణ
ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ అనే ప్రచారం
ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పలు ఎస్సై పోస్టులు
ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న
ఎస్సై పోస్టుల వివరాలు
జిల్లా మంజూరు ఖాళీలు
ఆదిలాబాద్ 10 07
నిర్మల్ 07 02
మంచిర్యాల 10 02
కుమురంభీం 06 01
Comments
Please login to add a commentAdd a comment