అభివృద్ధి పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

Mar 27 2025 12:23 AM | Updated on Mar 27 2025 12:23 AM

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

ఆసిఫాబాద్‌అర్బన్‌: నీతి ఆయోగ్‌ ఆస్పిరేషన ల్‌ బ్లాక్‌ కార్యక్రమంలో భాగంగా తిర్యాణి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లాతో కలిసి విద్య, వైద్యం, సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 20 గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతిగృహా ల్లో శుద్ధమైన తాగునీరందించేందుకు ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. అవసరమై న అనుమతులు పొందాలని ఆదేశించారు. అలాగే యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఆసిఫాబాద్‌ పట్టణ సమీపంలో ఏర్పాటు చే సేందుకు స్థలం గుర్తించాలని సూచించారు. ఆరు మినీ అంగన్‌వాడీ మోడల్‌ భవన నిర్మాణ పనులు చేపట్టాలని, ఎంపిక చేసిన ఆరు పాఠశాలల్లో మరమ్మతులు, అదనపు తరగతి గదులు నిర్మించాలన్నారు. తిర్యాణి మండలంలో పాఠశాలలు, రైతువేదికలు, ప్రాథమి క ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల్లో డిజిటల్‌ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా కంప్యూటర్లు, ప్రింటర్లు సమకూర్చాలన్నారు. అభివృద్ధి ప నులు సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సీపీవో కోటయ్యనా యక్‌, డీటీడీవో రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌, పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్‌, ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, డీఎంహెచ్‌వో సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement