
మహిళా మార్ట్‌లకు
మహిళలను లక్షాధికారులను చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉన్న అవకాశాలను కూడా ఊడగొట్టి వారిని రోడ్డుపాలు చేస్తోంది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మలిచేందుకు చేయూత మహిళా మార్ట్‌లను ఏర్పాటుచేసింది. కేవలం రూ.200 పెట్టుబడితో ప్రతి డ్వాక్రా మహిళ వ్యాపార భాగస్వామి అయింది. వ్యాపారంలో వచ్చే లాభాల్లో జీవిత కాలం వాటాదారు అయింది. అయితే జగన్ హయాంలో ఏర్పాటుచేసిన మార్ట్‌లను కొనసాగిస్తే ఆ పేరు ఆయనకే వస్తుందన్న దురాలోచనతో కూటమి ప్రభుత్వం వీటి నిర్వీర్యానికి నడుంకట్టింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పెడనలో మార్ట్‌ను మూసివేయించింది. మిగతా మార్ట్‌ల మూసివేతకు కుట్రలు పన్నుతోంది.
Comments
Please login to add a commentAdd a comment