భూముల రీసర్వే పరిశీలన | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వే పరిశీలన

Published Thu, Mar 20 2025 2:28 AM | Last Updated on Thu, Mar 20 2025 2:29 AM

భూముల

భూముల రీసర్వే పరిశీలన

చందర్లపాడు(నందిగామ టౌన్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో జరుగుతున్న భూ రీ సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ఉస్తేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెండో దశ రీసర్వే ప్రక్రియను ఆయన బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అత్యంత జవా బుదారీ తనంతో భూముల లెక్కలను పక్కాగా తేల్చేందుకే రీసర్వే జరుగుతోందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో సర్వే, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో రీసర్వే చేస్తున్నారని తెలిపారు. రైతుల అనుమానా లను నివృత్తి చేస్తూ ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా కచ్చిత రికార్డుల రూపకల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ సర్వేతో చేకూరే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, సర్వే, భూ రికార్డులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమరావు, మండల సర్వేయర్‌, వీఆర్వోలు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి పలువురు భక్తుల విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన కొల్లి నాగశివ మారుతీధర్‌ కుటుంబ సభ్యులు నిత్యాన్నదానానికి రూ.1,16,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. గుంటూరు గోరంట్లకు చెందిన వాసా భాస్కరరావు రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.2.65 కోట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు రూ.2.65 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంత స్తులో లెక్కించారు. రూ.2,65,88,961 నగదు, 500 గ్రాముల బంగారం, 4.358 కిలోల వెండి సమకూరాయని ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్‌ తెలిపారు. కార్యక్రమాన్ని ఆలయ డీఈఓ రత్నరాజు, దేవస్థాన ఏఈఓలు, సూప రింటెండెంట్లు, దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు.

సేవలందించిన విద్యార్థులకు సత్కారం

పెనమలూరు: మండలంలోని కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 341 ఇంజినీరింగ్‌ కాలేజీల నుంచి 31 మంది సిబ్బంది, 155 మంది విద్యార్థులు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ మెంటార్లుగా సేవలందించారు. వారిని ఘనంగా సత్కరించారు. ఇంజినీరింగ్‌ కాలేజీల సిబ్బంది, విద్యార్థులు సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏపీ ఉన్నత విద్యా మండలి, బే కన్సర్వేషన్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ (బీసీడీసీ), యూనిసెఫ్‌ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్‌ ఇండియా చీఫ్‌ ఆఫీసర్‌ జెలాలెం బి.టఫెస్సే, సమగ్ర శిక్ష రాష్ట్ర అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎఆర్‌.ప్రసన్నకుమార్‌, నీతి ఆయోగ్‌ ప్రోగ్రాం మేనేజర్‌ ప్రతీక్‌దేశ్‌ముఖ్‌, బీసీడీఐ కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎం.ఎల్‌. ఎస్‌.దేవకుమార్‌ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శివాజీబాబు, పలు సంస్థల ప్రతినిధులు శేషగిరి, సుదర్శన్‌, శిఖరాణా, కిషోర్‌ గైక్వాడ్‌, డాక్టర్‌ శ్యామ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భూముల రీసర్వే పరిశీలన1
1/3

భూముల రీసర్వే పరిశీలన

భూముల రీసర్వే పరిశీలన2
2/3

భూముల రీసర్వే పరిశీలన

భూముల రీసర్వే పరిశీలన3
3/3

భూముల రీసర్వే పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement