కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ అధికారిగా మనజీర్ జిలానీ సమూన
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ అధికారిగా డాక్టర్ మనజీర్ జిలానీ నమూన్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌కు విచ్చేసి కలెక్టర్ డి.కె.బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో జరిగే సంక్షేమ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పరిపాలనను పటిష్ట పరిచేందుకు అంతర్ శాఖల సమావేశం సమన్వయం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్‌చార్జులుగా నియమించింది. ఈ నేపథ్యంలో మనజీర్ జిలానీ నమూన్ జిల్లాలోని అమలవుతున్న పలు అంశాలు, సంక్షేమ పథకాలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత కలెక్టర్ బాలాజీ ఆయనకు మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment