పామర్రు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పామర్రు నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌ను వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యునిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా కై లే అనిల్‌కుమార్ మాట్లాడుతూ తనను నమ్మి అవకాశాన్ని కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుని పార్టీని మరింతగా పటిష్టపరిచే విధంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని చెప్పారు.
పీఎం యోగ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి
విజయవాడస్పోర్ట్స్: దేశవ్యాప్తంగా యోగ అభివృద్ధికి, ప్రచారానికి కృషి చేసిన యోగా నిపుణులకు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2025 వ సంవత్సరానికి గాను ప్రధానమంత్రి యోగ అవార్డును ప్రదానం చేసేందుకు ప్రకటన జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ పి.ఎస్.గిరీష తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న రాష్ట్రానికి చెందిన యోగా నిపుణులు అవార్డు నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తులు httpr:// innovate india.mygov.in/pm-yoga-awardrs–2025/ వైబ్సెట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ నెల 30వ తేదీ లోపు పంపించాలని పేర్కొన్నారు.
ఘంటసాల బౌద్ధ స్థూపాన్ని
సందర్శించిన జపాన్ దేశస్తులు
ఘంటసాల: ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఘంటసాల బౌద్ధ స్థూపాన్ని, మ్యూజియాన్ని సందర్శించడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని జపాన్ దేశస్తులు అన్నారు. కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్థూపం, బౌద్ధ మ్యూజియాన్ని బుధవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా బౌద్ధ స్థూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థూపం ఎదురుగా ఉన్న బౌద్ధ శిల్ప సంపద ఉన్న మ్యూజియాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘంటసాల గ్రా మ చరిత్ర, బౌద్ధ స్థూపం, మ్యూజియం వివరాలను జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ జపాన్ దేశస్తులకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ధ క్షేత్రాల సందర్శనలో భాగంగా ఘంటసాల బౌద్ధ స్థూపం, మ్యూజియాన్ని సందర్శించినట్లు హైదరాబాద్‌కు చెందిన గైడ్ కరుణానిధి తెలిపారు. అమరావతి, నాగా ర్జున సాగర్, గుంటుపల్లి గుహలు, శ్రీకాకుళం జిల్లాలోని బౌద్ధ ప్రదేశాల్లో పర్యటించి ఘంటసాలకు వచ్చినట్లు చెప్పారు. జపాన్ దేశస్తులు నాకజిమ యుకి హిసా, కటయమా తత్తసు, ఊరగామి నోరికో, సానో కాజుహారు, కనికో తకాకాజు, మంచిదా షాంచి, యామజకి తదశి, వాకుయ్ తోషిమితసు, టోనే మోటాకో పాల్గొన్నారు.