ఆర్టీసీ డిస్పెన్సరీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిస్పెన్సరీ ప్రారంభం

Published Fri, Mar 28 2025 2:15 AM | Last Updated on Fri, Mar 28 2025 2:11 AM

మచిలీపట్నంటౌన్‌: స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో నిర్మించిన జిల్లా డిస్పెన్సెరీ భవనాన్ని సంస్థ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర గురువారం ప్రారంభించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.80 లక్షలతో నిర్మించిన ఈ నూతన డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన సదుపాయాలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మచిలీపట్నం నుంచి రేపల్లె, బాపట్ల, చీరాల మీదుగా ఒంగోలు బస్సు సర్వీసును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లా డుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కోసం డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. 50 వేల ఉద్యోగులు, 8 వేల మంది ఒప్పంద ఉద్యోగు లతో అతిపెద్ద వ్యవస్థగా ఆర్టీసీ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గంగాధరరావు, జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.వాణిశ్రీ, డిపో మేనేజర్‌ టి.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement