ఇల కై లాసమైన శ్రీగిరిలో ప్రణవనాదం హోరెత్తుతోంది. నల్లమల గిరుల్లో భక్తుల మల్లన్న న్మాసరణ మారుమోగుతోంది. శివయ్యా.. శరణు శరణు అంటూ మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పాదయాత్రగా తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక వాయనం సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు.
– శ్రీశైలంటెంపుల్
Comments
Please login to add a commentAdd a comment