కర్నూలు(అర్బన్): రిజర్వేషన్లలో ఎస్సీ ఉప వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం కర్నూలులో భారీగా రాయలసీమ మాలల యుద్ధగర్జన సభను నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల జేఏసీ కన్వీనర్ యాట ఓబులేసు, గౌరవాధ్యక్షులు గోన నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చెన్నూరు, వర్దన్నపేట ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ఆర్‌కే నాగరాజు, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్, మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావ్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, స్వర్గీయ పీవీ రావు సోదరుడు పీఎస్‌ఎన్ మూర్తి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మాలలు ఈ సభకు రానున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment