మారిన ప్రశ్నపత్రం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం (ఆర్‌యూ) పరిధిలో శనివారం డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. రియల్ ఎనాలసిస్ ప్రశ్నపత్రానికి బదులు అబ్‌స్ట్రాక్ట్ ఆల్‌జీబ్రా ప్రశ్నపత్రాన్ని ఇచ్చారు.ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి విద్యా ర్థులు తీసుకెళ్లారు. తప్పు గ్రహించిన వర్సిటీ అధికారులు అసలైన ప్రశ్నపత్రాన్ని అన్ని పరీక్ష కేంద్రాలకు మెయిల్ చేసి జిరాక్స్ తీయించాలని ఆదేశించారు. కేంద్రాల సీఎస్‌లు ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించి వి ద్యార్థులకు ఇచ్చి పరీక్ష రాయించారు. గంట ఆలస్యం కాగా.. విద్యార్థులకు కేవలం 20 నిమిషాలు మాత్రమే అదనపు సమయం ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈనెల 17న ఆర్‌యూలో ఎమ్‌సీఏ విద్యార్థులకు మ్యాఽథమేటికల్ ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ బదులు మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ప్రశ్నపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థులతో ఆ పరీక్షను రాయించకుండా ఈనెల 21వ తేదీ నిర్వహించారు. అయితే కొన్ని సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులు చెబుతున్నారు. ఒక టైటిల్ బదులు మరో టైటిల్ ప్రశ్నపత్రం ప్రింటిగ్ అయ్యే దగ్గర నుంచే ప్యాకింగ్‌లో వచ్చిందని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
మారిన ప్రశ్నపత్రం
Comments
Please login to add a commentAdd a comment