
రైలు నుంచి పడి యువకుడి మృతి?
ఆదోని సెంట్రల్: రైలు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య శనివారం విలేకరుల కు తెలిపారు. రైలు నుంచి ప్రమాదవశా త్తు జారి పడ్డారా.. ఆత్మహత్యకు పాల్పడ్డారా విషయం తెలియలేదన్నారు. ఆదోని నగరూర్, రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ పక్కన మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు వయస్సు 30 ఏళ్లు ఉంటాయన్నారు. మృతుడి దగ్గర పగిలిపోయిన మొబైల్ ఫోన్ తప్ప మిగతా అధారాలు దొరక లేదన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సీడాప్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు
కర్నూలు(అర్బన్): సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ నెల 28, మార్చి 4, 14, 18, 28వ తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ తెలిపారు. మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన తదితర సామాజిక వర్గాలకు చెందిన యువత వారి అర్హతలను అనుసరించి https://seedap.ap.gov.in వెబ్‌సైట్‌లో యూత్ రిజిస్ట్రేషన్ కాలమ్‌ను క్లిక్ చేసి కోర్సు వివరాలను నమోదు చేయాలని తెలిపా రు. వివరాలకు 9848864449, 9160903300ను సంప్రదించాలన్నారు.
ప్రాణం తీసిన ఇంటి గోడ
కౌతాళం: ఇంటి గోడ కూలి మదిరె గ్రామానికి చెందిన కోసిగి కిష్టప్ప (61) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మదిరె గ్రామానికి చెందిన కోసిగి కిష్టప్ప గ్రామంలో బేల్దార్ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం గ్రామంలో దేవర పండుగ ఘనంగా జరుపుకున్నారు. శనివారం పనులు నిమిత్తం గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన ఇంటి గోడను తొలగించేందుకు తోటి కూలీలతో పాటు కిష్టప్ప వెళ్లారు. అక్కడ పనులు చేస్తుండగా ఉన్నట్టుండి ఇంటి గోడ ఒక్క సారిగా కూలిపోయింది. పక్కనే పనిచేస్తున్న కిష్టప్పపై రాళ్లు పడ్డాయి. తోటి కూలీలు రాళ్లను తొలగించి కిష్టప్పను వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. కిష్టప్పకు భార్య దేవమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

రైలు నుంచి పడి యువకుడి మృతి?
Comments
Please login to add a commentAdd a comment