
చెత్త రహిత గ్రామాలే లక్ష్యం
కర్నూలు(అర్బన్): జిల్లాలో చెత్త రహిత గ్రామ పంచాయతీలే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 412 గ్రామ పంచాయతీల్లో ఎస్‌డబ్యూపీసీ (సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్) కేంద్రాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా పూర్తి కాని, మరమ్మతులు చేపట్టాల్సిన షెడ్లను గుర్తించి, పనులను చేపట్టనున్నామన్నారు. ఇందుకు పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు రూ.1.87 కోట్లతో 110 షెడ్లను పలు రకాల రిపేర్లకు అంచనాలను రూపొందించారన్నారు. పూర్తయిన కేంద్రాలకు తడి, పొడి చెత్తను తరలించి వర్మీ తయారీతో గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 1 నుంచి 31వ తేది వరకు గార్గేయపురం, చిన్నటేకూరు, కోడుమూరు, పత్తికొండ, ఆస్పరి, ఆలూరు, మంత్రాలయం, కౌతాళం, పెద్దహరివాణం, హోళగుంద మండలలాల్లో ఈ సమావేశాలను నిర్వహించనున్నామన్నారు. అలాగే ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
హిందూ ధర్మాన్ని కాపాడటమే లక్ష్యం
● వీహెచ్‌పీ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు
నందిరెడ్డి సాయిరెడ్డి
కర్నూలు కల్చరల్: విశ్వహిందూ పరిషత్‌లో బాధ్యతలు తీసుకున్న వారు హిందూ ధర్మాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేయాలని వీహెచ్‌పీ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి అన్నారు. పుల్లారెడ్డి కళాశాల సమీపంలోని విజ్ఞాన పీఠంలో వీహెచ్‌పీ రెండు రోజుల అభ్యాస వర్గ శిక్షణ తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమి శెట్టి వెంకటరామయ్య మాట్లాడుతూ.. వీహెచ్‌పీ కార్యకలాపాలను విస్తృతం చేయాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రాణేష్, అభ్యాస వర్గ అధికారి అనంత విశ్వప్రసాద్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు టీసీ మద్దిలేటి, జిల్లా కార్యదర్శి భానుప్రకాష్, సహ కార్యదర్శులు గిరిబాబు, ఈపూరి నాగరాజు, శ్రీనివాసరెడ్డి, లక్ష్మిపావని తదితరులు పాల్గొన్నారు.

చెత్త రహిత గ్రామాలే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment