
ప్రతి జర్నలిస్టు ఈ–శ్రమ్ కార్డును పొందండి
కర్నూలు(సెంట్రల్): సామాజిక భద్రతకు ప్రతి జర్నలిస్టు ఈ–శ్రమ్ కార్డును పొందాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని డీపీఆర్‌ఓ కార్యాలయ ఆవరణలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఈ–శ్రమ్ కార్డుపై అవగాహన కార్యక్రమం నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఐఅండ్ పీఆర్ డీడీ జయమ్మ, లేబర్ ఆఫీసర్ రామ్ ప్రసాదు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఇంకమ్‌ట్యాక్స్ చెల్లించని జర్నలిస్టులు ఈ–శ్రమ్ కార్డు పొందవచ్చన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం లేని వారందరు కూడా అర్హులేన్నారు. ఈ–శ్రమ్ కార్డు ఉంటే ప్రమాదంలో మరణిస్తే రూ.2లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.లక్ష పరిహారం కుటుంబ సభ్యులకు అందుతుందన్నారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వానికి
విశేష స్పందన
ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర మొదటి సభ్యత్వాన్ని ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి.హుస్సేన్‌కు అందజేశారు. అనంతరం అక్కడికక్కడే దాదాపు 20మందికిపైగా జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వం తీసుకున్నారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ అవగాహన సదస్సులో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment