
టీడీపీ నేతలు దాడులు చేస్తే కేసు నమోదు చేయరా?
కర్నూలు(అర్బన్): ‘టీడీపీ నేతలు దురుద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసినా పోలీసులు కేసు నమోదు చేయరా’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో వైఎస్సార్‌సీపీకి చెందిన బోయ సురేంద్రకుమార్ అలియాస్ సుభాష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత దామోదర్‌నాయుడు, అతని అనుచరులు ఈ నెల 19న వేటకొడవళ్లు, రాడ్‌లతో దాడి చేసి హత్యాయత్నం చేశారని, అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. బాధితులు శనివారం తమ కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు నగరంలోని సుభాష్ నివాసానికి వచ్చి దాడి వివరాలను తెలిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన తనను అంతమొందిస్తే గ్రామంలో తిరుగు ఉండదనే ఉద్దేశంతో దామోదర్‌నాయుడు, అతని సోదరులు బరితెగించారన్నారు. తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేశారని బాధితుడు సురేంద్రకుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో దామోదర్‌నాయుడి అరాచకాలు మితిమీరిపోయాయన్నారు. ప్రస్తుతం ఆయన భార్య సర్పంచ్‌గా ఉన్నారని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీకి వస్తాననే ఉద్దేశంతో అడ్డుతొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బోయ సురేంద్రకుమార్ వాపోయారు. టీడీపీ నేత, అతని అనుచరుల దాడిలో తనకు బలమైన గాయాలయ్యాయన్నారని, ఇందుకు సంబంధించి అదే రోజున (19వ తేదీన) కృష్ణగిరి ఎస్‌ఐ, సీఐకి ఫిర్యాదు చేశామని, కానీ ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్నారు. తన మామ ఎర్రమల మద్దిలేటి టీడీపీ నేత దాడిని అడ్డుకున్నారని, లేదంటే తనను చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడికి పాల్పడిన దామోదర్‌నాయుడు, అతని సోదరులపై వెంటనే కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేస్తామన్నారు.
బోయ సురేంద్రకుమార్ ఫిర్యాదును
పట్టించుకోరా?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త
కార్యదర్శి ఎం సుభాష్ చంద్రబోస్
Comments
Please login to add a commentAdd a comment