
పాదయాత్ర భక్తుల భద్రతపై నిఘా
● కె లాసద్వారం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నల్లమల అటవీప్రాంతం మీదుగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తుల భద్రత కోసం శ్రీశైల దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ నెల 19న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి కై లాసద్వారం వద్ద రెండు అధునాతన టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేనప్పటికీ సోలార్ సహాయంతో ఇవి పని చేస్తాయి. ఈ కెమెరాలు సుమారు భీమునికొలను వరకు పాదయాత్ర భక్తుల ఫుటేజ్ రికార్డు చేస్తాయి. నల్లమల అడవిలో పాదయాత్ర భక్తులకు ఏదేని సమస్య వచ్చిన తక్షణమే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుని తక్షణ సహయం అందిస్తున్నారు. అలాగే ప్రస్తుతం దేవస్థానంలో ఉన్నసుమారు 600 సీసీ కెమెరాలకు తోడు అదనంగా మరో 29 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శివస్వాముల పీపుల్ కౌంటింగ్‌కు ప్రత్యేక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూం వద్ద ఉన్న వీడియో వాల్‌లో వెయ్యి కెమెరాలను చూసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment