
భక్తులతో మర్యాద పూర్వకంగా మెలగండి
శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి తరలివచ్చిన భక్తులతో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. శనివారం రాత్రి భ్రమరాంబా వీఐపీ అతిథి గృహ ప్రాంగణంలో బందోబస్తుపై వచ్చిన పోలీ సు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో బ్రహ్మోత్సవాలకు బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. పోలీసులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అవసరమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. బందోబస్తు పోలీసులకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. కేటాయించిన ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా అందరూ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో ఐపీఎస్ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే , అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్
Comments
Please login to add a commentAdd a comment