
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
బొమ్మలసత్రం: టెక్కె మార్కెట్ యార్డు సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ (45) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో స్టాంప్ రైటర్‌గా పని చేస్తున్నా డు. శుక్రవారం రాత్రి పని ముగించు కుని ఇంటికి బయలుదేరాడు. స్థానిక టెక్కె మార్కెట్‌యార్డు వద్ద రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వచ్చి బైక్ ఢీకొని శంకర్ మృతికి కారణమైన నిందితుడు దినేష్‌రెడ్డిపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment