
లక్ష్మమ్మ అవ్వకు బంగారు కిరీటం
ఆదోని అర్బన్: ఆదోని ఇలవేల్పు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు బంగారు కిరీటం తయారయ్యింది. మేలో జరగబోవు అవ్వ 93వ రథోత్సవం సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాచోటి రామయ్య కేజీ మూడు గ్రాములు బంగారు కిరీటాన్ని చేయించారు. కిరీటాన్ని దేవదాయ శాఖ అధికారుల అనుమతితో చేయించినట్లు రాచోటి రామయ్య బుధవారం తెలిపారు. కిరీటాన్ని తయారు చేయడానికి సహకరించిన బంగారు దుకాణాదారులకు, ఎండోమెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రశాంతంగా
‘జేఈఈ మెయిన్స్’
కర్నూలు సిటీ: జాతీయ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. వేళకు 40 నిమిషాల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించారు. కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టుకు సమీపంలోని సనత్‌నగర్‌లోని ఐయాన్ డిజిటల్ జోన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం 274 మందికిగాను 259 మంది, మధ్యాహ్నం 263 మందికిగాను 249మంది హాజరయ్యారు. ఈ పరీక్షలు ఈనెల 9వ తేదీ వరకు జరగనున్నాయి.
ఆర్‌యూ అభివృద్ధిలో
భాగస్వాములు కావాలి
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య వి.ఉమ సూచించారు. ఆర్‌యూ, క్లస్టర్ (సీయూ) యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్ వీసీగా నిమియతులైన ఆమె బుధవారం ఆర్‌యూను సందర్శించారు. వీసీ చాంబర్‌లో రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.నరసింహులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేష న్స్ ఆచార్య సీవీ సుందరనాంద్, రీసెర్స్ డైరెక్టర్ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్.భరత్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లుతో సమావేశమై వర్సిటీకి సంబంధించిన విషయాలను చర్చించారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్లుతో పాటు వర్సిటీలోని వివిఽ ద విభాగాల అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగులు ఇన్‌చార్జ్ వీసీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

లక్ష్మమ్మ అవ్వకు బంగారు కిరీటం

లక్ష్మమ్మ అవ్వకు బంగారు కిరీటం